Tirumala: ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
తిరుమల గిరులు సరికొత్త శోభ సంతరించుకొన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అలిపిరి, కపిలతీర్థం వద్ద వరద నీరు పరవళ్ళు తొక్కుతోంది.
తిరుమలలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా పొంగి పొర్లుతోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. కపిలతీర్థం ఎత్తైన జలపాతం నుంచి కుండపోతగా వర్షం నీరు పడుతోంది. జలపాతం వద్దకు భక్తులు వెళ్లకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఏడుకొండల్లో పరచుకొన్న పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాల అందాలు భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. భారీ వర్షాలకు తిరుమలలో జలాశయాలు ప్రధాన నిండు కుండను తలపిస్తున్నాయి. గోగర్భం జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండాయి. అదే విధంగా వర్షం కారణంగా తిరుగిరుల్లో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో భక్తులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.