హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ను చూసి ఆయన సతీమణి స్నేహా రెడ్డి భావోద్వేగానికి గురైయ్యారు. అల్లు అర్జున్ ఆమెను గుండెకు హత్తుకుని ఓదార్చారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం తెలిసిందే.