AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొమ్ముతో ఏకంగా జీపును ఎత్తిపడేసింది!  భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు.. చివరకు..

కొమ్ముతో ఏకంగా జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు.. చివరకు..

Phani CH
|

Updated on: May 21, 2026 | 4:22 PM

Share

అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్‌లో సఫారీ జీపుపై భారీ ఖడ్గమృగం దాడి చేసిన ఘటన టూరిస్టులను భయభ్రాంతులకు గురిచేసింది. ఒక్కసారిగా జీపుపై దూసుకొచ్చిన రైనో కొమ్ముతో వాహనాన్ని ఎత్తేసేలా దాడి చేసింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో జీపును వెనక్కి తీసి అందరినీ సురక్షితంగా కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ అడవిలో సఫారీ జీప్ లో ప్రయాణిస్తూ చుట్టూ పచ్చదనాన్ని, ప్రకృతి అందాలను చూస్తూ మురిసిపోతున్నారు టూరిస్టులు అంతలోనే సీన్ రివర్స్ అయింది. ఎక్కడి నుంచో ఒక్కసారిగా దూసుకొచ్చిన భారీ రైనో జీపుపై దాడికి దిగింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని టూరిస్టులు కేకలు పెట్టారు. ఊహించని ఈ భయానక ఘటన అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్‌లో జరిగింది. మానస్ నేషనల్ పార్క్‌లో టూరిస్టులు జీపులో అడవిని చుట్టేస్తుండగా.. అప్పుడే ఓ భారీ ఖడ్గమృగం రోడ్డుపైకి వచ్చింది. స్థిరంగా ఉన్న ఆ జీపును చూసి దానికి ఎందుకో కోపం వచ్చింది. అంతే.. నేరుగా వచ్చి కొమ్ముతో జీపును బలంగా పొడవడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా వాహనాన్ని గాల్లోకి లేపి బోర్లా నెట్టేయడానికి ప్రయత్నించింది. రైనో ధాటికి ఆ జీపు గాల్లోకి లేచింది. జీపులో ఉన్న టూరిస్టులు భయంతో వణికిపోతూ గట్టిగా కేకలు వేశారు. ఆ సమయంలో డ్రైవర్ ఏ మాత్రం కంగారు పడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. చాకచక్యంగా జీపును వెనక్కి తీసి రైనో బారి నుంచి టూరిస్టులను కాపాడాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అడవి జంతువులు తమకు ఏదో ముప్పు పొంచి ఉందని భావించినప్పుడు లేదా తమ పిల్లల రక్షణ కోసం ఇలా ప్రవర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అడవిలోకి వెళ్లినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం! బ్యాంకాక్‌లో భారత మహిళ పోస్ట్ వైరల్

కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు

వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం

Aadhaar Update: ఆధార్ అప్డేట్‌‌పై కేంద్రం గుడ్‌ న్యూస్‌

భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

Follow Us