Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌..

|

Sep 06, 2024 | 6:00 PM

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రుతుపవన ద్రోణి.. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి, పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1కి.మీ ఎత్తు వరకు ఆవరించిన ఉందని వివరించారు.

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రుతుపవన ద్రోణి.. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి, పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1కి.మీ ఎత్తు వరకు ఆవరించిన ఉందని వివరించారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు.

దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమురం భీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే ఛాన్స్‌ ఉందని చెప్పింది. బుధవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలుపడే సూచనలున్నాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on