Viral Video: పోస్ట్‌మార్టం వద్దంటూ.. బాడీతో పరుగో పరుగు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజాగా ఓ వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాలని కుటుంబసభ్యులకు సూచించారు.
తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల జడల మల్లయ్య అనే వ్యక్తి శుక్రవారం తన ఇంట్లో మృతి చెందాడు. కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. అంతలోనే.. గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. అందుకు మల్లయ్య కుటుంబసభ్యులు నిరాకరించారు. పోలీసులు వారితో మాట్లాడుతుండగానే మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. మల్లయ్య గుండెపోటుతో మరణించాడని, ఆయన మృతిపై తమకు ఎటువంటి అనుమానం లేదంటూ శ్మశానవాటిక వైపు పరుగులు తీశాడు. పోలీసులు ఆయన్ను వెంబడించి మరీ మృతదేహాన్ని సిరిసిల్లకు తరలించి శవపరీక్ష నిర్వహించారు. మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్‌కానిస్టేబుల్ సాంబశివరావు తెలిపారు. గురువారం రాత్రి కుటుంబసభ్యులమంతా కలిసి భోజనం చేసి నిద్రపోయామని, శుక్రవారం తెల్లవారుజామున చూసేసరికి తన భర్త మరణించి ఉన్నాడని మల్లయ్య భార్య చంద్రవ్వ పోలీసులకు తెలిపారు. తనకు ఎవరిపైనా అనుమానం లేదని, విచారణ చేపట్టి చర్య తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

