Watch: అటు హైడ్రా అంటే హడల్.. ఇటు సపోర్ట్‌గా ర్యాలీ.. వీడియో చూశారా..
హైడ్రా.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలామంది హడలిపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆక్రమణల తొలగింపు పర్వాన్ని హైడ్రా గత కొన్ని వారాల ముందు నుంచే చేపట్టగా.. హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను కూడా హైడ్రా కూల్చివేయడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది.
హైడ్రా.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలామంది హడలిపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆక్రమణల తొలగింపు పర్వాన్ని హైడ్రా గత కొన్ని వారాల ముందు నుంచే చేపట్టగా.. హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను కూడా హైడ్రా కూల్చివేయడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. రాజకీయ పార్టీలు కూడా విభిన్న రీతిలో దీనిపై స్పందిస్తున్నాయి. కాగా హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు తమ కట్టడాలు కూల్చేస్తాయో అని హైదరాబాద్‌లోని చాలా మంది టెన్షన్ పడుతున్నారు. హైడ్రాతో ప్రభుత్వం పొలిటికల్ గేమ్ ఆడుతోందని విపక్షాలు విమర్శిస్తుంటే.. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. తగ్గేదేలే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చేశారు. అటు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు కొన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తోంది.
హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సపోర్ట్ వాక్ నిర్వహించింది. ఈ సపోర్ట్ వాక్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రజలు మద్దతు తెలిపారు. ఈ వాక్‌లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మనది హైడ్రా మనందరిదీ అనే నినాదాలు చేశారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

