Virtual ATM: OTP చెబితే చాలు.. డబ్బులిచ్చేస్తారు..
మీ ప్రాంతంలో లేదా వెళ్లిన కొత్త ప్రదేశంలో ఏటీఎం పనిచేయడం లేదా? క్యాష్ విత్‌డ్రా చేయడం కష్టం అవుతోందా? అయితే ఈ వర్చువల్ ఏటీఎంతో డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ లేకుండానే నగదు సులభంగా పొందొచ్చు. వర్చుల్ ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ సరిపోతుంది. మీరు కార్డ్‌లెస్ నగదు తీసుకోవాలంటే మొదటగా పేమార్ట్ బ్యాంకింగ్ యాప్‌ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
మీ ప్రాంతంలో లేదా వెళ్లిన కొత్త ప్రదేశంలో ఏటీఎం పనిచేయడం లేదా? క్యాష్ విత్‌డ్రా చేయడం కష్టం అవుతోందా? అయితే ఈ వర్చువల్ ఏటీఎంతో డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ లేకుండానే నగదు సులభంగా పొందొచ్చు. వర్చుల్ ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ సరిపోతుంది. మీరు కార్డ్‌లెస్ నగదు తీసుకోవాలంటే మొదటగా పేమార్ట్ బ్యాంకింగ్ యాప్‌ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ద్వారా బ్యాంకుకు విత్‌డ్రా రిక్వెస్ట్ చేయాలి. ఇది చేయాలంటే యూజర్ మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ రిక్వెస్ట్‌కు వినియోగదారుడి బ్యాంక్, ఒక ఓటీపీ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్‌ను మీ సమీపంలోని దుకాణాల్లో చూపిస్తే, వారు నగదు ఇస్తారు. ఈ సేవలు అందించే దుకాణాల లిస్ట్, లొకేషన్, ఫోన్‌నంబర్ తదితర వివరాలు పేమార్ట్ యాప్‌లో ఉంటాయి. మూరుమూల ప్రాంతాల్లో నివసించేవారు, అక్కడికి వెళ్లేవారికి ఈ సేవలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం పేమార్ట్ కంపెనీ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తమ సేవలు అందిస్తోంది. అందులో చండీగఢ్, దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుర్రం దిగు… నడిచి వెళ్లు దళితునికి అగ్రవర్ణాల బెదిరింపులు
శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ.. మేమేం చేయలేమన్న విమాన సిబ్బంది..
కిడ్నాపర్లనుకొని కొత్త వాళ్ళను చితగొడుతున్న జనం.. వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు
Putin – Elon Musk: రష్యా ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడును చంపేస్తారా ??
ఎక్సైజ్ సీఐ బదిలీ.. కన్నీటి పర్యంతమైన నిరుద్యోగులు.. ఎందుకంటే ??