బుల్లెట్‌ కా బాప్‌.. అరగంటలో 350 కిలోమీటర్లు.. మన దేశంలో..వీడియో

Updated on: Feb 28, 2025 | 2:26 PM

బుల్లెట్‌ ట్రెయిన్‌ ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. కానీ బుల్లెట్‌ కా బాప్‌ వస్తే ఎలా ఉంటుందో చూశారా? ఇప్పుడు మీకు సీన్‌ చూపించబోతున్నాం. ఈ రవాణా విధానం పేరు హైపర్‌ లూప్‌. దీని స్పీడ్‌ ఎంతో తెలుసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ చెబుతాం. ఢిల్లీ టూ జైపూర్‌ మధ్య దూరం 296 కిలోమీటర్లు. రైల్లో వెళితే ఐదు నుంచి ఐదున్నర గంటలు పడుతుంది. కానీ అదే హైపర్‌లూప్‌లో వెళితే అరగంటలో చేరుకోవచ్చు అంటే నమ్ముతారా?ఢిల్లీ టూ జైపూర్‌ మధ్య దూరం 296 కిలోమీటర్లు. హైపర్‌ లూప్‌ విధానంలో కేవలం అరగంటలోనే ఈ ప్రయాణం ముగించవచ్చు. దీనితో 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చట. ఇది అక్షరసత్యం. ఎందుకంటే రైల్వేశాఖ సహకారంతో IIT మద్రాస్‌ కొత్త ప్రయోగం చేస్తోంది.

422 మీటర్ల హైపర్‌లూప్‌ ట్రాక్‌ను రెడీ చేసింది. హైపర్‌లూప్‌ అంటే సుదూర మార్గాల్లో వేగంగా ప్రయాణించేందుకు తయారుచేసిన హైస్పీడ్‌ ట్రాక్‌ అని అర్థం. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుదయస్కాంత ట్రాక్‌ను తయారుచేస్తారు. ఒక ప్రత్యేకమైన ట్యూబ్‌లో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ఈ హైపర్‌లూప్‌లో రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ ప్రయోగాల కోసం ఇప్పటికే IIT మద్రాస్‌కు రైల్వేశాఖ 17.5 కోట్ల రూపాయలను రెండు విడతలుగా ఇచ్చింది. మూడో విడతలో మరో 8 కోట్ల రూపాయలను ఇవ్వబోతున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఐదవ రవాణా విధానం’గా పిలిచే హైపర్‌లూప్ అనేది సుదూర ప్రయాణానికి ఉపయోగించే హై-స్పీడ్ రవాణా వ్యవస్థ. ఇక చైనాలో కూడా హైపర్‌లూర్‌ ప్రాజెక్టు జోరుగా సాగుతోంది. ఈ విషయంలో మనకన్నా డ్రాగన్‌ కంట్రీ అడ్వాన్స్‌గా ఉంది. ఇప్పటికే చైనాలో హైపర్‌లూప్‌ ట్యూబ్‌ సిద్ధమైంది. భవిష్యత్‌ అంతా ఇదే అంటున్నారు. వాస్తవానికి హైపర్‌లూప్‌ ప్రాజెక్టును ఎలాన్‌ మస్క్‌ చేపట్టాలని భావించినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద మస్క్‌ రాకెట్లపై దృష్టిపెడితే, భారత్‌-చైనా భూమ్మీద ఈ హైపర్‌లూప్‌ ప్రాజెక్టును చేపడుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో

డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో

ఆ ఫోటోను చూస్తే కోతులకు ఎందుకంత భయం? వీడియో

నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్..వీడియో