AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jathara: మేడారం జాతర ఏర్పట్లలో ఐఏ టెక్నాలజీ.! రద్దీ నియంత్రణ కోసం.

Medaram Jathara: మేడారం జాతర ఏర్పట్లలో ఐఏ టెక్నాలజీ.! రద్దీ నియంత్రణ కోసం.

Anil kumar poka
| Edited By: TV9 Telugu|

Updated on: Feb 14, 2024 | 3:28 PM

Share

తెలంగాణాలోని మేడారం మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే ఈ మహా జాతరకు ఈసారి కోటిన్నరపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో భక్తల రద్దీని దృష్టిలో పెట్టుకొని జాతర ఏర్పాట్లలో సాంకేతికతను కూడా వినియోగిస్తోంది.

తెలంగాణాలోని మేడారం మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే ఈ మహా జాతరకు ఈసారి కోటిన్నరపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో భక్తల రద్దీని దృష్టిలో పెట్టుకొని జాతర ఏర్పాట్లలో సాంకేతికతను కూడా వినియోగిస్తోంది. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన కెమెరాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వీటిని కంట్రోల్ రూంకు అనుసంధానిస్తున్నారు. వీటి ద్వారా చదరపు మీటరులో నలుగురికంటే ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాలను గుర్తించి, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకుంటారు. భక్తుల సంఖ్యను కొలిచే క్రౌడ్‌ కౌటింగ్ కెమెరాలు, వాహనాల సంఖ్యను అంచనా వేసేందుకు నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మేడారం ప్రధాన కూడళ్లు, గద్దెల ప్రాంగణం, పార్కింగ్ స్థలాల్లో 500 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కంట్రోల్ రూంకు అనుసంధానమై ఉండే వీటి ద్వారా 24 గంటలూ నిఘా పెడతారు. నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. ప్రత్యేక సిబ్బంది సాయంతో వీటిని నిర్వహిస్తారు. జాతర వివరాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మేడారంలోని పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో తప్పిపోయిన వారి వివరాలను కూడా తెరలపై ప్రసారం చేస్తారు. వాహనాల పార్కింగ్‌ కోసం 1400 ఎకరాల మేర విస్తరించి ఉన్న 33 పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తెస్తున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ 6 వేల బస్సులను నడపాలని నిర్ణయించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Feb 13, 2024 07:02 PM