Sarayu Solar Boat: దేశంలో తొలిసారి.. సరయూ నదిలో సోలార్ బోట్.! అయోధ్యకు 45 నిముషాల్లోనే.
జనవరి 22న శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు అయోధ్య సిద్ధమవుతోంది. సన్నాహాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య నగరాన్ని మోడల్ సోలార్ సిటీగా మారుస్తోంది. ఈ సందర్భంగా సరయూ నదిలో సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ బోట్‌ను ప్రారంభించింది. నదిలో సోలార్ బోట్‌ను ప్రవేశపెట్టడం భారతదేశంలోనే ఇదే తొలిసారి. ఈ పర్యావరణ అనుకూల బోట్ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన న్యూ ఎనర్జీ డెవలప్‌మెంట్ అథారిటీ, పూణేకు చెందిన పడవ తయారీ సంస్థ..
జనవరి 22న శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు అయోధ్య సిద్ధమవుతోంది. సన్నాహాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య నగరాన్ని మోడల్ సోలార్ సిటీగా మారుస్తోంది. ఈ సందర్భంగా సరయూ నదిలో సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ బోట్‌ను ప్రారంభించింది. నదిలో సోలార్ బోట్‌ను ప్రవేశపెట్టడం భారతదేశంలోనే ఇదే తొలిసారి. ఈ పర్యావరణ అనుకూల బోట్ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన న్యూ ఎనర్జీ డెవలప్‌మెంట్ అథారిటీ, పూణేకు చెందిన పడవ తయారీ సంస్థ మధ్య సహకారంతో నడవనుంది. అయోధ్య తర్వాత వారణాసిలోని గంగా నదిలో కూడా త్వరలోనే సోలార్ బోట్‌ను ప్రారంభించనున్నారు. సోలార్ బోట్ ఇటీవలి కాలంలో అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. కాలుష్యానికి కారణమయ్యే శిలాజ ఇంధనాలతో నడిచే సాంప్రదాయ పడవలు కాకుండా, ఈ క్లీన్ ఎనర్జీ బోట్ 100 శాతం సౌరశక్తితో పనిచేస్తుంది. దీని తయారీలో ఫైబర్‌గ్లాస్ ఉపయోగించారు . ఇది తేలికైనప్పటికీ భారీ బరువులను మోయగలదు. భక్తులు ఈ పడవ ద్వారా 45 నిమిషాలలో అయోధ్య చేరుకోవచ్చు. అంతేకాకుండా సరయూ ఒడ్డున ఉన్న చారిత్రక దేవాలయాలు, వారసత్వ ప్రదేశాలను అన్వేషించవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos