బయటపడ్డ గురుగ్రహం.. అసలు రహస్యం..షాక్‌లో నాసా..! వీడియో

అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా సైంటిస్టులతోపాటూ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఖగోళ పరిశోధకులకు అంతుబట్టని మిస్టరీగా ఉంది గురుగ్రహంపై ఉన్న భారీ తుఫాను.

అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా సైంటిస్టులతోపాటూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఖగోళ పరిశోధకులకు అంతుబట్టని మిస్టరీగా ఉంది గురుగ్రహంపై ఉన్న భారీ తుఫాను. ఇది భూమి కంటే పెద్ద సైజులో ఉంటుంది. అయితే… ఈ తుఫాను వల్ల ఏర్పడిన సుడి ఎంత లోతు ఉంది అనే దానిపై నాసా ఇన్నాళ్లూ తక్కువ అంచనా వేసింది. కానీ తాజాగా నాసాకి ఈ తుఫానుకు సంబంధించి షాకింగ్‌ విషయాలు తెలిసాయి. గురుగ్రహానికి సంబంధించి నాసా కొత్త త్రీడీ ఇమేజెస్ రూపొందించింది. వాటిని బట్టీ ఈ తుఫాను… పైకి తుఫానులా… లోపల భారీ సుడిగుండంలా ఉందనే విషయం గుర్తించారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. త్రీడీ ఇమేజెస్ చూసిన తర్వాత సైంటిస్టులకు కొత్త అనుమానం కలిగింది. ఈ తుఫాను క్రమంగా పైన తగ్గిపోతూ… లోపల పెరుగుతూ… గ్రహం లోపలికి వెళ్లిపోతూ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ రెడ్‌ స్పాట్‌ “లోపలికి చొచ్చుకుపోవడానికి బలమైన అడ్డంకులు ఏవీ ఉండకపోవచ్చని అని జునో మిషన్‌కి పర్యవేక్షణ చేస్తున్న ప్రముఖ సైంటిస్ట్ స్కాట్ బాల్టన్ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

అమ్ముడుపోని లాటరీ టికెట్.. లక్షలు తెచ్చిపెట్టింది.. వీడియో

పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులకు వింత కండీషన్‌ పెట్టిన వధువు.. వీడియో

రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో

Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో

బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్‌ కామెంట్స్‌.! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu