Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బ్రెజిల్‌లో జన్మించిన ఓ వింత శిశువు వైద్యులనే ఆశ్చర్యపరిచింది. ఫోర్టలెజా పట్టణానికి చెందిన నిండు గర్భిణి ఒకరు ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది.
బ్రెజిల్‌లో జన్మించిన ఓ వింత శిశువు వైద్యులనే ఆశ్చర్యపరిచింది. ఫోర్టలెజా పట్టణానికి చెందిన నిండు గర్భిణి ఒకరు ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. సాధారణ కాన్పునకు అవకాశం లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు బాలుడికి తోక ఉండడం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. 12సెంటీమీటర్ల పొడవున్న ఆ తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉండడం వైద్యులను ఆశ్చర్యపరిచింది. మహిళ గర్భం దాల్చిన తర్వాత అదే ఆసుపత్రిలో తరచూ పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఎప్పుడూ ఆ తోకను గుర్తించలేదని వైద్యులు తెలిపారు. దీనిని నిజమైన మానవతోకగా అభివర్ణిస్తున్న వైద్యులు.. ఆ తోకకు నాడీ వ్యవస్థకు ఎలాంటి అనుసంధానం లేదని, చర్మానికి మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేసి ఆ తోకను తొలగించినట్టు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

