మనిషి నూరేళ్లు జీవించడం ఇక సులువే !! బయోలాజికల్ ఏజ్ తగ్గించడంపై ఫోకస్
మనిషి నిండు నూరేళ్లు బతికే రోజులు త్వరలోనే రానున్నాయని అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బయాలజిస్టు, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్ బయాలజీ - ఐఎస్‌బీ వ్యవస్థాపకుడు డాక్టర్ లెరోయ్‌హుడ్ తెలిపారు. పుట్టిన తేదీ ప్రకారం వయసు క్రోనలాజికల్ వయసు ముఖ్యం కాదనీ, జీవ సంబంధమైన వయసు బయోలాజికల్ ఏజ్ కీలకం అన్నారు. బయోలాజికల్ వయసు అనేది జన్యువులు, జీర్ణకోశ ఆరోగ్యం, వ్యాయామం, నిద్ర, ఇతర అలవాట్లపై ఆధారపడి ఉంటుందనీ కొన్ని రకాల రక్త పరీక్షలతో..
మనిషి నిండు నూరేళ్లు బతికే రోజులు త్వరలోనే రానున్నాయని అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బయాలజిస్టు, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్ బయాలజీ – ఐఎస్‌బీ వ్యవస్థాపకుడు డాక్టర్ లెరోయ్‌హుడ్ తెలిపారు. పుట్టిన తేదీ ప్రకారం వయసు క్రోనలాజికల్ వయసు ముఖ్యం కాదనీ, జీవ సంబంధమైన వయసు బయోలాజికల్ ఏజ్ కీలకం అన్నారు. బయోలాజికల్ వయసు అనేది జన్యువులు, జీర్ణకోశ ఆరోగ్యం, వ్యాయామం, నిద్ర, ఇతర అలవాట్లపై ఆధారపడి ఉంటుందనీ కొన్ని రకాల రక్త పరీక్షలతో ప్రతి వ్యక్తి బయోలాజికల్ వయసును నిర్ధారించే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. క్రోనలాజికల్ ఏజ్ కంటే బయోలాజికల్ వయసు తక్కువగా ఉండాలనీ తాజాగా జరుగుతున్న అధ్యయనాలతో బయోలాజికల్ వయసును తగ్గించవచ్చని అన్నారు. పదేళ్లలో వైద్య చికిత్సల్లో పెనుమార్పులు రానున్నాయి. వ్యాధులను పదేళ్ల ముందే గుర్తించేలా అమెరికాలో కీలక పరిశోధనలు జరుగుతున్నాయి. పది లక్షల మందిలో ఈ అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధాప్య సమస్య, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ముందే పసిగట్టవచ్చు. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కార్తీక దీపాలు వెలిగించేందుకు 10 కి.మి. కొండెక్కుతున్న భక్తులు
15 అడగుల పొడవు భారీ ఆకారంలో కొండ చిలువ !! పుట్టపర్తిలోని ఓ ఇంటి ఆవరణలో హల్‌చల్
థర్డ్ ఏసీ టికెట్ ఉన్నా ట్రైన్ ఎక్కలేక అవస్థ !! టికెట్ డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీకి A++ గ్రేడ్.. ఇక విదేశాల్లోనూ బ్రాంచ్‌లు పెట్టుకోవచ్చు
తాత కారు అని గుర్తుపట్టి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లిన రెండేళ్ల చిన్నారి