అదో దెయ్యం.. రాత్రి 8 దాటితే ఊరు దాటనీయదు..! ఇంట్రెస్టింగ్ హర్రర్ సినిమా
"సుమతి వలవు" అనే మలయాళ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను భయపెడుతోంది. కేరళలోని తిరువనంతపురం సమీపంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, ఓ మారుమూల గ్రామంలోని "సుమతి మలుపు" చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో భారీ విజయం సాధించి, ఐఎండిబిలోనూ మంచి రేటింగ్ పొందిన ఈ సినిమా ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాలు, సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అలరిస్తున్నాయి. అయితే, ఇటీవల ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ, టాప్ ట్రెండ్‌లో దూసుకుపోతోంది. ఆ సినిమా పేరే “సుమతి వలవు”. వలవు అంటే తెలుగులో మలుపు అని అర్థం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మలయాళ చిత్రం, కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామ ప్రజలు రాత్రి 8 గంటలు దాటితే బయటకు రావడానికి భయపడతారు, ముఖ్యంగా అటవీ ప్రాంతంలోని “సుమతి మలుపు” వద్దకు వెళ్లడానికి సాహసించరు. ఎవరైనా వెళ్తే వింత సంఘటనలు ఎదురై, స్పృహ కోల్పోయి ఆసుపత్రి పాలవుతుంటారు.
మరిన్ని వీడియోల కోసం :
