కాంతార కలెక్షన్ల విధ్వంసం హిస్టరీ క్రియేట్ చేసిన రిషబ్ వీడియో
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో విడుదలైన కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే 89 కోట్ల గ్రాస్ వసూలు చేసి, రిషబ్ శెట్టి కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 105.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రీక్వెల్ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. విడుదలైన నాటి నుంచే ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో విధ్వంసం సృష్టిస్తోంది.మొదటి రోజే భారీ వసూళ్లను రాబట్టిన కాంతార చాప్టర్ 1, ప్రీమియర్స్ తో కలిపి 89 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ ఫీట్‌తో 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్లలో ఒకటిగా నిలిచింది. ఇది రిషబ్ శెట్టి కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. రెండో రోజు కూడా సినిమా వసూళ్లు తగ్గకుండా, దాదాపు 43.65 కోట్ల గ్రాస్‌ను సాధించింది.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
