భార్య టార్చర్ పెడుతోందంటూ.. ఫోక్ సింగర్ ఆత్మహత్య వీడియో
భార్య వేధింపులు తట్టుకోలేక టాలెంటెడ్ ఫోక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లిలో సెప్టెంబర్ 29న బలవన్మరణానికి పాల్పడిన ఆయన, చనిపోవడానికి ముందు తన గోడును సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేశారు. ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న రాజు, భార్య కోసం కొన్న చీరతోనే ఉరివేసుకుని చనిపోవడం విషాదకరంగా మారింది.
భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ ఫోక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య చేసుకోవడం జానపద పరిశ్రమలో విషాదం నింపింది. ఎక్కువగా ఆలోచిస్తూ, ఒత్తిడికి లోనవుతూ కొందరు ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో, గడ్డం రాజు కూడా అదే బాట పట్టారు. తన భార్య టార్చర్ పెడుతోందని, అది భరించలేకపోతున్నానని ఆయన ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను రికార్డ్ చేశారు.సెప్టెంబర్ 29న తన స్వస్థలం పెద్దపల్లిలో రాజు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయనకు ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. పెద్ద బతుకమ్మ పండగ కోసం తన భార్యకు కొన్న చీరతోనే ఉరివేసుకుని చనిపోవడం అందరినీ కలచివేసింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు రాజు రికార్డ్ చేసిన ఈ సెల్ఫీ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
జన నాయకుడికి తిప్పలు తప్పవా..? వీడియో
కుర్చీ మడతబెట్టి కొడితే 700 మిలియన్లు వీడియో
నీవి ఆ ఫోటోలు పంపిస్తావా..?’ నా కుమార్తెనే వేధించారు.. హీరో ఆవేదన వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
ఇదో గాలి రైలు.. అంటే గాల్లో ఎగరదు.. పట్టాలపై వాయువేగంతో దూసుకెళ్త
బీ అలర్ట్.. పడుకునే ముందు మొబైల్ చూస్తున్నారా?
17 రోజుల్లో రూ.14.85 కోట్లు ఫట్.. డిజిటల్ అరెస్ట్ చేసి దోచేసిన
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
మీ పిల్లలకు ఈ సిరప్ వాడుతున్నారా..వెంటనే బయట పడేయండి వీడియో
భోగి వేడుకల్లో డోలు వాయించిన హోంమంత్రి అనిత.. వీడియో వైరల్
ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు తీవ్ర చలి వీడియో
