Tollywood: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఆమె మనందరికీ ఇష్టమైన సెలబ్రిటీ
సుమ కనకాల చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు జడలతో, పెద్ద కళ్ళద్దాలతో ఉన్న ఆ చిన్నారి ఫోటో చూస్తే సుమ అని వెంటనే గుర్తుపడతారు. ప్రస్తుతం ఆమె తెలుగు బుల్లితెరలో ప్రముఖ బ్రాండ్‌గా ఎదిగింది. ఆమె విజయవంతమైన కెరీర్, ఆమె ప్రజంట్ రేంజ్ ఏంటో ఈ కథనం వివరిస్తుంది.
తాజాగా సోషల్ మీడియాలో సుమ కనకాల చిన్ననాటి ఫోటో వైరల్‌గా మారింది. రెండు జడలు, పెద్ద కళ్ళద్దాలు ధరించి చిరునవ్వుతో ఉన్న ఆ చిన్నారిని చూడగానే ఎవరైనా సుమ అని గుర్తుపడతారు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరలో టాప్ యాంకర్‌గా, టివి షోల హోస్ట్‌గా, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లలో ప్రధాన వ్యాఖ్యాతగా సుమ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ, తనదైన ప్రతిభతో నంబర్ వన్ గా దూసుకుపోతోంది. కేరళకు చెందిన ఆమె అచ్చమైన తెలుగు అమ్మాయిలా మాట్లాడటం విశేషం. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తెలుగు బుల్లితెరలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. జయమ్మ పంచాయితీ సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించింది. సుమ ప్రస్తుతం తన కెరీర్‌లో మంచి జోష్‌తో దూసుకుపోతోంది. ఆమె డేట్స్ దొరకక ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు వాయిదా వేసిన స్టార్స్ కూడా ఉన్నారు. ఇంతటి పేరు, ప్రఖ్యాతి దక్కించుకున్న సుమ ఇప్పుడు ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు.
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

