Srisailam: శ్రీశైలంలో వైభవంగా బంగారు రథంపై విహరించిన ఆదిదంపతులు

Edited By:

Updated on: Mar 08, 2025 | 1:34 PM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకాకళ్యాణార్ధం శ్రీస్వామి అమ్మవారికి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించి.. అనంతరం స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు.

స్వర్ణరథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుండి నంది మండపం వరకు మళ్ళీ నంది మండపం నుండి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు,గిరిజనుల నృత్యాలు మేళతాళాలతో వైభవంగా జరిగింది స్వర్ణరథోత్సవంలో వందలాదిగా స్థానికులు,భక్తులు తరలివచ్చి స్వర్ణరథోత్సవం తిలకించారు స్వర్ణరథంలో ఆసీనులైన శ్రీస్వామి అమ్మవారు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు అయితే ప్రతీమాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈస్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు…..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కదా విశ్వాసం అంటే.. యజమాని కోసం పులితో పోరాడి ఓడిన శునకం

ఆన్‌లైన్‌లోకి ఆర్టీఏ సేవలు.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్‌ లైసెన్స్‌

అట్లీపై గుర్రుగున్న.. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్

హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్

పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ…

Published on: Mar 08, 2025 01:33 PM