Srikakulam: ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో తాడు సాయంతో ప్రమాదం అంచున విద్యార్థినిల ప్రయాణం
శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షం స్థానికులకు ఇబ్బందులు తెచ్చింది. జి.సిగడాం మండలం బాతువ గ్రామంలోని రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నీటమునిగిపోవడంతో విద్యార్థినిలు, మహిళా వ్యవసాయ కూలీలు తాడు సాయంతో ఉధృత ప్రవాహంలో వాగును దాటి గ్రామాలకు చేరుకున్నారు. వర్షం పడినప్పుడల్లా ఇలాగే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జి.సిగడాం మండలం బాతువ గ్రామంలో భారీ వర్షానికి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి మార్గం పూర్తిగా మునిగిపోయింది. సాయంత్రం స్కూల్స్, కాలేజీలు విడిచిపెట్టే సమయం కావడంతో గ్రామానికి వెళ్లే మార్గం లేక విద్యార్థినిలు, స్థానికంగా పొలం పనులు ముగించుకొని తమ నివాసాలకు వెళ్లే మహిళా వ్యవసాయ కూలీలు తీవ్ర అవస్థలు పడ్డారు. కాసేపు నిరీక్షించినప్పటికీ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి మార్గంలో వాటర్ తగ్గకపోవటంతో పాటు వేరే ప్రత్యామ్నాయ మార్గం కూడా లేకపోవడంతో చేసేది లేక తాడు సాయంతో రైల్వే ట్రాక్ పక్క నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ తమ గ్రామానికి చేరుకున్నారు. ప్రమాదమని తెలిసి కూడా ప్రత్యామ్నాయ మార్గం లేక జోరు ప్రవాహంలో విద్యార్థినిలు, మహిళలు సాహసోపేత ప్రయాణం చేశారు. వర్షం పడినప్పుడల్లా తమకు ఈ పరిస్థితి తప్పటం లేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అని వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇకనైనా స్పందించి అధికారులు సరికొత్త మార్గాన్ని కల్పించాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

