Virat Kohli: వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆ మూడింటిలోనూ అతడే నంబర్ వన్

| Edited By: TV9 Telugu

Nov 18, 2023 | 6:02 PM

టీమిండియా స్టార్ బ్యాటర్‌, కింగ్ కోహ్లీ వరల్డ్‌కప్‌లో మరో సెంచరీ బాదేశాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా అవతరించాడు. ఇప్పటిదాకా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ 49 సెంచరీలతో కలిసి సమాన రికార్డులో ఉన్న విరాట్ లేటెస్ట్‌ శతకంతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీని నమోదు చేశాడు. కివీస్‌పై సూపర్ సెంరీతో కోహ్లీ మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్‌, కింగ్ కోహ్లీ వరల్డ్‌కప్‌లో మరో సెంచరీ బాదేశాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా అవతరించాడు. ఇప్పటిదాకా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ 49 సెంచరీలతో కలిసి సమాన రికార్డులో ఉన్న విరాట్ లేటెస్ట్‌ శతకంతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీని నమోదు చేశాడు. కివీస్‌పై సూపర్ సెంరీతో కోహ్లీ మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక వన్డే ప్రపంచకప్‌లో 8సార్లు 50 ప్లస్‌ ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ విరాట్‌దే అగ్రస్థానం. ఇప్పటి దాకా సచిన్‌ 2003లో సాధించిన 673 పరుగులే అత్యధికం. ఇప్పుడు విరాట్ దానిని అధిగమించేశాడు. ప్రస్తుతం 711 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు కోహ్లీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రచారానికని వెళ్లి పల్లి చేన్ల కలుపు తీసిన మంత్రి శీనన్న

పోలీసోల్ల యాప్ డౌన్లోడ్ పెట్టు.. డిస్కౌంట్ ఆఫర్ పట్టు

మనుషుల మీద కోతుల రౌడీయిజం.. బయటకి రావడానికే భయపడుతున్న జనాలు

Vishakapatnam: విశాఖలో విశాఖలో డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

జమ్ముకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు

 

Published on: Nov 16, 2023 09:37 AM