మనుషుల మీద కోతుల రౌడీయిజం.. బయటకి రావడానికే భయపడుతున్న జనాలు
అరె వా.. అద్రుష్టవంతులంటె గా ప్రకాశం జిల్లా గిద్దలూరోల్లేనుల్లా..? ఎందుకంటరా? వాల్ల టౌను పబ్లిక్కున్న పే.. ద్ద సమస్య తీర్శిర్రట అక్కడి అధికారులు. అబ్బ.. పెద్ద పరెషాన్ వొయ్యింది మాకు.. అని యాడాదిలచ్చే అన్ని పండుగలను కల్పి చేస్కున్నంత సంబురంగ ఉన్నరట.. ఇంతకు ఏందో.. ఆ గిద్దలూరు అధికారులు తీర్చిన వాల్ల సమస్య.. పొయ్ సూద్దుమా?? అగొ ఏదో పే.. ద్ద సమస్యాన్నరు.. పాపం.. గీ బోన్ల బంధీలైన కోతుల మందను సూపెడ్తరేందీ.. అనుకుంటుర్రేమొ..
అరె వా.. అద్రుష్టవంతులంటె గా ప్రకాశం జిల్లా గిద్దలూరోల్లేనుల్లా..? ఎందుకంటరా? వాల్ల టౌను పబ్లిక్కున్న పే.. ద్ద సమస్య తీర్శిర్రట అక్కడి అధికారులు. అబ్బ.. పెద్ద పరెషాన్ వొయ్యింది మాకు.. అని యాడాదిలచ్చే అన్ని పండుగలను కల్పి చేస్కున్నంత సంబురంగ ఉన్నరట.. ఇంతకు ఏందో.. ఆ గిద్దలూరు అధికారులు తీర్చిన వాల్ల సమస్య.. పొయ్ సూద్దుమా?? అగొ ఏదో పే.. ద్ద సమస్యాన్నరు.. పాపం.. గీ బోన్ల బంధీలైన కోతుల మందను సూపెడ్తరేందీ.. అనుకుంటుర్రేమొ.. కోతులున్న ఊల్లె ఇంతకంటె పెద్ద సమస్యేముంటదో శెప్పుర్రి మరి? అరరరరే.. వొండుకున్న బువ్వగిన్నెలు, కూరగిన్నెలెత్కపోతయ్.. శెట్లమీద పండ్లు, కాయెలు దక్కనియ్యయ్.. పోరగాల్లను పీకి గీకి వెడ్తుంటయ్.. బైటకి రానియ్యయ్.. బాజాప్త నడ్వనియ్యయ్.. అగొ అంత భయపెడ్తున్నయ్ గిద్దలూరోల్లను ఈ కోతులు.. ఇగ లాభంలేదని ఆయింత కోతులు వట్టేటోల్లను విల్పిచ్చి బోన్లు వెట్టి అటీటు 200 కోతులను వట్టిచ్చి జంగల్ల ఇడ్శిపెట్టిర్రట..హమ్మయ్య పీడ వొయ్యిందిపో.. అని గట్టిగ దమ్ము తీస్కుంటుర్రట.. గిద్దలూరోల్లంత.. అగ సూడు బోన్లకేలి ఎట్ల సూస్తున్నయో.. అరేయ్ గిద్దలూర్ పబ్లికూ.. ఇన్నొద్దులు మిమ్ములను కర్శి గీకి పెట్టి మా బలం సూపెట్టినా గింత భయం లేకుంట మమ్ములనే పట్టిస్తరా?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishakapatnam: విశాఖలో విశాఖలో డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
జమ్ముకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు
Leo OTT: లీక్ దెబ్బకు దిగొచ్చిన టీం.. ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్…
Daily Horoscope: ఆ రాశివారిపై అష్టమ రాహు ప్రభావం అయినా ఆ ఒక్క శక్తితో రోజంతా శుభం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

