మలుపు తిప్పిన మహమ్మద్ షమీ.. భారత్ గెలుపుతో అంబరాన్నంటినసంబరాలు..

మలుపు తిప్పిన మహమ్మద్ షమీ.. భారత్ గెలుపుతో అంబరాన్నంటినసంబరాలు..

Phani CH

|

Updated on: Nov 16, 2023 | 9:41 AM

వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. సెమీస్‌లో న్యూజిల్యాండ్‌పై భారత్ ఘన విజయం సాధించగా.. మ్యాచ్ లో  సెంచరీలతో దుమ్మురేపారు విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌. రికార్డులు బద్దలయ్యేలా వీరబాదుడు బాదారు. 7 వికెట్లు తీసి విజయానికి బాటలు వేశాడు బౌలర్‌ మహ్మద్‌ షమీ. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 397 పరుగులు చేసింది.. టార్గెట్‌ చేజింగ్‌లో చతికిల పడ్డ న్యూజిలాండ్‌ 327కి ఆలౌట్‌ అయింది. 2011 తర్వాత వరల్డ్‌కప్‌ ఫైనల్‌కి చేరిన భారత్‌.

వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. సెమీస్‌లో న్యూజిల్యాండ్‌పై భారత్ ఘన విజయం సాధించగా.. మ్యాచ్ లో  సెంచరీలతో దుమ్మురేపారు విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌. రికార్డులు బద్దలయ్యేలా వీరబాదుడు బాదారు. 7 వికెట్లు తీసి విజయానికి బాటలు వేశాడు బౌలర్‌ మహ్మద్‌ షమీ. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 397 పరుగులు చేసింది.. టార్గెట్‌ చేజింగ్‌లో చతికిల పడ్డ న్యూజిలాండ్‌ 327కి ఆలౌట్‌ అయింది. 2011 తర్వాత వరల్డ్‌కప్‌ ఫైనల్‌కి చేరిన భారత్‌. చరిత్రలో భారత్‌ ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్‌ ఆడింది. ఇప్పుడు నాలుగోసారి తుదిపోరుకు సిద్ధమైంది. అయితే గత మూడు పర్యాయాల్లో రెండుసార్లు టైటిల్‌ నెగ్గింది భారత్‌. 1983లో కపిల్‌దేవ్‌ సారథ్యంలో జగజ్జేతగా నిలిస్తే.. 2011లో ధోనీ హయాంలో కప్‌ నెగ్గింది భారత్‌. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కప్‌ నెగ్గాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో టాప్‌ స్కోరర్‌గా విరాట్‌ కోహ్లీ 711 పరుగులతో నిలిస్తే.. టాప్‌ వికెట్‌ టేకర్‌గా మహ్మద్‌ షమీ 23 వికెట్లతో నిలిచాడు. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే భారత ఆటగాళ్లు ఇన్ని పరుగులు చేయడం.. వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Virat Kohli: వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆ మూడింటిలోనూ అతడే నంబర్ వన్

ప్రచారానికని వెళ్లి పల్లి చేన్ల కలుపు తీసిన మంత్రి శీనన్న

పోలీసోల్ల యాప్ డౌన్లోడ్ పెట్టు.. డిస్కౌంట్ ఆఫర్ పట్టు

మనుషుల మీద కోతుల రౌడీయిజం.. బయటకి రావడానికే భయపడుతున్న జనాలు

Vishakapatnam: విశాఖలో విశాఖలో డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

 

Published on: Nov 16, 2023 09:39 AM