కోహ్లీ రికార్డుల రాత.. అయ్యర్ సిక్సర్ల మోత.. షమీ వికెట్ల తీత..
ముంబైలోని వాంఖడే స్టేడియం జయజయద్వానాలతో మార్మొగిపోయింది. దేశవ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది ప్రజలు ఆనందంతో తాండవం చేశారు. కొన్ని ఏళ్లుగా మనకు పీడకలలా మారిన కివీస్ జట్టును అత్యంత కీలకమైన సెమీఫైనల్లో మట్టికరిపించడం మామూలు విషయం కాదు. జోరుమీదున్న బ్లాక్‌కాప్స్‌ను అంతకన్నా స్పీడుమీదున్న మనోళ్లు కట్టిపడేశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. ఆది నుంచి దడదడలాడించింది.
ముంబైలోని వాంఖడే స్టేడియం జయజయద్వానాలతో మార్మొగిపోయింది. దేశవ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది ప్రజలు ఆనందంతో తాండవం చేశారు. కొన్ని ఏళ్లుగా మనకు పీడకలలా మారిన కివీస్ జట్టును అత్యంత కీలకమైన సెమీఫైనల్లో మట్టికరిపించడం మామూలు విషయం కాదు. జోరుమీదున్న బ్లాక్‌కాప్స్‌ను అంతకన్నా స్పీడుమీదున్న మనోళ్లు కట్టిపడేశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. ఆది నుంచి దడదడలాడించింది. రోహిత్, నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 47 రన్స్‌చేశాడు. హాఫ్ సెంచరీ ముంగిట ఔటయ్యాడు. కాని తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. సంయమనంతో ఆడాడు. గిల్ తనదైన శైలిని ప్రదర్శించాడు. సిక్సర్లు, బౌండరీలని మిక్స్ చేసి కొట్టాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు వందకుపైగా పరుగులు జోడించారు. గిల్ మూడు సిక్సులు, ఎనిమిది ఫోర్లతో మంచి జోరుమీద కనిపించాడు. 79 రన్స్ దగ్గర కండరాలు పట్టేయడంతో పెవీలియన్‌కు వెనుదిరిగాడు. ఈ సమయంలో వచ్చి బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. కివీస్ బౌలర్లకు రెస్ట్ లేకుండా చేశాడు. కీలకమైన మిడిల్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నంతసేపూ ఏం చేయాలో తెలియక తికమక పడ్డారు న్యూజిలాండ్ కెప్టెన్ అండ్ బౌలర్స్. అంతకముందు నెదర్లాండ్స్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన అయ్యర్.. అదే జోరును కొనసాగించాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం67 బాల్స్‌లో 8 సిక్సులు, మూడు ఫోర్లతో సెంచరీ చేశాడు అయ్యర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మలుపు తిప్పిన మహమ్మద్ షమీ.. భారత్ గెలుపుతో అంబరాన్నంటినసంబరాలు..
Virat Kohli: వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆ మూడింటిలోనూ అతడే నంబర్ వన్
ప్రచారానికని వెళ్లి పల్లి చేన్ల కలుపు తీసిన మంత్రి శీనన్న
పోలీసోల్ల యాప్ డౌన్లోడ్ పెట్టు.. డిస్కౌంట్ ఆఫర్ పట్టు
మనుషుల మీద కోతుల రౌడీయిజం.. బయటకి రావడానికే భయపడుతున్న జనాలు