Abdul Razzaq – Aishwarya Rai: ఐశ్వర్యారాయ్‌ని నేను పెళ్లి చేసుకొని ఉంటే అంటూ కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్‌.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌పై పాక్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఓపెన్ డిబేట్‌లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదిలతో కలిసి రజాక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే అంటూ హద్దులు దాటాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి.

Abdul Razzaq - Aishwarya Rai: ఐశ్వర్యారాయ్‌ని నేను పెళ్లి చేసుకొని ఉంటే అంటూ కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్‌.

|

Updated on: Nov 15, 2023 | 4:24 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌పై పాక్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఓపెన్ డిబేట్‌లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదిలతో కలిసి రజాక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే అంటూ హద్దులు దాటాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. రజాక్ నోటి వెంట ఒక్కసారిగా ఐశ్వర్య రాయ్‌ పేరు రావడంతో మొదట షాక్ తిన్న షాహిద్ అఫ్రిది.. ఆ తర్వాత నవ్వుతూ చప్పట్లు కొట్టడం గమనార్హం. రజాక్‌తో పాటు గుల్, అఫ్రిదిల తీరుపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. మీ దేశం నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్‌ అవుతున్నారు. ఒక స్త్రీ పట్ల ఇలా మాట్లాడటం సిగ్గు చేటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

అంతేకాదు తోటి మాజీ క్రికెటర్లు సైతం అతడిని తప్పుపట్టడంతో చివరికి క్షమాపణలు చెప్పాడు. క్రికెట్‌ కోచింగ్‌, దాని ఉద్దేశాలను గురించి మాట్లాడాల్సిన సమయంలో .. నోరుజారి ఐశ్వర్యారాయ్‌ పేరును ప్రస్తావించాను, ఆమెకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు అంటూ పాక్‌లోని స్థానిక మీడియా వేదికగా క్షమాపణలు తెలిపాడు. అతడితోపాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరో క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. భారత్‌లో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌- 2023 జరుగుతుంది. ఇందులో భాగంగా నవంబరు 15న సెమీస్‌లో భారత్‌ Vs న్యూజిలాండ్‌ మధ్య పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీలో లీగ్‌ స్టేజ్‌లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదుచేసిన పాకిస్తాన్‌ ఇంటిముఖం పట్టింది. ఈ వరల్డ్‌ కప్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ ఓటములను పాక్‌ అభిమానులతో పాటు ఆ జట్టు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
ఎలాంటి తప్పు చేయలేదని మా పేరెంట్స్‌కి చెప్పాను.. యానిమల్‌ బ్యూటీ
ఎలాంటి తప్పు చేయలేదని మా పేరెంట్స్‌కి చెప్పాను.. యానిమల్‌ బ్యూటీ
Telangana: ముందు పానీయం ఇస్తాడు.. ఆ తర్వాతే అసలు కథ..
Telangana: ముందు పానీయం ఇస్తాడు.. ఆ తర్వాతే అసలు కథ..
ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన కార్తీ జపాన్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన కార్తీ జపాన్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం .. ద్వాపరయుగంతో అనుబంధం
కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం .. ద్వాపరయుగంతో అనుబంధం
పాములతో పెంపుడు జంతువుల్లా ఆడుకుంటున్న చిన్నారి బాలిక..
పాములతో పెంపుడు జంతువుల్లా ఆడుకుంటున్న చిన్నారి బాలిక..
ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. మానసిక ప్రశాంతత..
ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. మానసిక ప్రశాంతత..
కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ
కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ
9 నెలల్లో రూ.17 వేల కోట్లు సంపాదించిన రాజీవ్‌జైన్
9 నెలల్లో రూ.17 వేల కోట్లు సంపాదించిన రాజీవ్‌జైన్
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్య
భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్య
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.