MS Dhoni: జైస్వాల్‌కు ధోని అదిరిపోయే సర్‌ఫ్రైజ్.. వీడియో
రాజస్థాన్ యువ బాట్స్ మ్యాన్ యశస్వి జైశ్వాల్‌కు, సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 21బంతుల్లో 50పరుగులు చేశాడు జైశ్వాల్.
రాజస్థాన్ యువ బాట్స్ మ్యాన్ యశస్వి జైశ్వాల్‌కు, సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 21బంతుల్లో 50పరుగులు చేశాడు జైశ్వాల్. ఈ సందర్భంగా బ్యాట్‌పై ధోని సంతకం చేశాడు. జైశ్వాల్‌తో పాటు పాటు శివమ్ దూబే కూడా అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ధోనీని కలిసిన జైశ్వాల్ తన బ్యాటుపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఈ బ్యాటుతో జైశ్వాల్ ఉన్న ఫోటోను ఐపీఎల్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. మ్యాచ్ తర్వాత నా బ్యాటుపై ధోని సంతకం తీసుకున్నా.. చాలా సంతోషంగా ఉందంటూ.. జైశ్వాల్ ట్వీటర్‌లో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ అనంతరం జైస్వాల్‌పై రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: North Korea: కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం.. కిమ్ సోదరికి భాద్యతలు.. వీడియో