మెస్సీ Vs రొనాల్డో ‘వెయ్యి గోల్స్’ మొనగాడు ఎవరు ??

Updated on: Jan 07, 2026 | 4:34 PM

లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో ఫుట్‌బాల్ ప్రపంచంలో సృష్టించిన రికార్డులు అపారం. 1000 కెరీర్ గోల్స్ సాధించే పోటీ ఉత్కంఠగా మారింది. రొనాల్డో 957 గోల్స్‌తో ముందంజలో ఉండగా, మెస్సీ 896 గోల్స్‌తో దూసుకుపోతున్నాడు. ఎవరు ముందు ఈ మైలురాయిని చేరుకుంటారు? వారి ప్రస్తుత క్లబ్‌లు, వయస్సు, మరియు భవిష్యత్ అవకాశాలపై ఈ కథనం విశ్లేషిస్తుంది. ఈ గోల్స్ వేట ఫుట్‌బాల్ చరిత్రలో మరపురాని ఘట్టం.

లియోనెల్‌ మెస్సీ మేనియాతో ఇటీవల భారత్‌ ఊగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ ఫ్యాన్స్‌ ఈ ఫుట్‌బాల్‌ దిగ్గజానికి బ్రహ్మరథం పట్టారు. అర్జెటీనా నుంచి ఆయన నేరుగా భారత్‌ విచ్చేసి పలు నగరాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఫుట్‌బాల్‌ క్రీడా ప్రపంచంంలో మరోసారి మెస్సీ గురించి చర్చ షురూ అయింది అంతకాదు.. మరో దిగ్గజ ఫుట్‌బాల్‌ అటగాడు పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానా రోనాల్డో కూడా ఈ చర్చలో కీలకంగా మారారు. ఇద్దరు క్రీడాకారులు రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఏలుతున్నారు. తమ కెరీర్‌ చివరి దశలో రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఎవరు నిలుస్తారనే దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ రేసులో రొనాల్డో ముందంజలో ఉన్నప్పటికీ, వయసురీత్యా మెస్సీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 చివరినాటికి క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో 957 అధికారిక గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు, లియోనెల్ మెస్సీ 896 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. 2026లో మెస్సీ తన 900వ గోల్‌ను అందుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఫుట్‌బాల్‌లో మ్యాజికల్ ఫిగర్‌గా భావించే ‘1000 గోల్స్’ మైలురాయిని ఎవరు ముందుగా చేరుకుంటారనేదే అసలు సిసలైన పోటీగా మారింది. వెయ్యి గోల్స్ మార్క్‌ను అందుకోవడానికి రొనాల్డో మరో 44 గోల్స్ దూరంలో ఉన్నాడు. సౌదీ ప్రో లీగ్ క్లబ్ అల్-నసర్ తరఫున ఆడుతున్న రొనాల్డో తన గోల్స్ వేటను కొనసాగిస్తున్నాడు. “గాయాలు కాకుండా ఉంటే కచ్చితంగా ఆ మార్క్ అందుకుంటాను” అని రొనాల్డో ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు, రొనాల్డో కంటే రెండున్నర సంవత్సరాలు చిన్నవాడైన మెస్సీ వెయ్యి గోల్స్ అందుకోవాలంటే మరో 100కు పైగా గోల్స్ చేయాల్సి ఉంది. అమెరికాలోని మేజర్ లీగ్ సాకర్ (MLS)లో ఇంటర్ మయామి క్లబ్‌కు ఆడుతున్న మెస్సీ, ఆ క్లబ్‌ను 2025లో MLS కప్ విజేతగా నిలబెట్టి ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’గా ఎంపికయ్యాడు. రొనాల్డో ఇదే జోరు కొనసాగిస్తే 2026 చివరి నాటికి లేదా 2027లో వెయ్యి గోల్స్ పూర్తిచేసే అవకాశం ఉంది. మెస్సీకి ఆ మార్క్ చేరడానికి 2028 వరకు సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోదావరిలో పడవలతో చిరంజీవి పేరు.. ఆకట్టుకున్న దృశ్యం

Sravana Bhargavi: భాగస్వామి సపోర్ట్‌ లేనప్పుడు.. ఇలాగే జరుగుతుంది !!

సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

Bala Krishna: NBK111 సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు.. నిజంగా అలా ఉండబోతుందా

Allu Arjun: కెరీర్ కోసం కత్తిలాంటి ప్లానింగ్.. అల్లు అర్జున్ అంటే ఆమాత్రం ఉంటది