
నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. ఈ జట్టు ఎంపికపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లకు ఇష్టమైన ఆటగాళ్లను మాత్రమే తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓపెనింగ్ బాధ్యతలను యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ భుజాలపై పడనున్నాయి. వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్‌కు స్థిరత్వాన్ని అందించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం :