రోదసిలో మన మహిళలలు… అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తెలుగమ్మాయి… ( వీడియో )

ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశాన్ని జయించబోతున్నది. ఇప్పటికే ఎందరో మహిళలు అంతరిక్షంలో అడుగు పెట్టారు.. ఇప్పుడు తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళకు ఆ అవకాశం దక్కింది.

|

Updated on: Jul 04, 2021 | 6:13 PM

ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశాన్ని జయించబోతున్నది. ఇప్పటికే ఎందరో మహిళలు అంతరిక్షంలో అడుగు పెట్టారు.. ఇప్పుడు తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళకు ఆ అవకాశం దక్కింది. ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో రోదసికి వెళ్లనున్న ఈ వ్యోమనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉన్నారు. కల్పనాచావ్లా, ఇండియన్‌ అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ తర్వాత అంతరక్షింలో అడుగుపెట్టబోతున్న భారత సంతతి మహిళ శిరీషనే! అంతే కాదు ఈ ఘనత సాధించబోతున్న తొలి తెలుగుతేజం కూడా శిరీషనే! అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్‌ సంస్థ సిద్ధం చేసిన ఓ ప్రత్యేక వ్యోమనౌక ద్వారా ఆమె రోదసిలోకి వెళ్లబోతున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె అంతరిక్షయానం చేయనున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Virat Kohli: పెళ్లిలో భార్యతో కలిసి చిందులేసిన టీమిండియా కెప్టెన్… ( వీడియో )

పంజాబ్ లో బీజేపీ నేత పొలాన్ని నాశనం చేసిన రైతులు.. నిరసనలో పాల్గొన్న మహిళలు… ( వీడియో )

Follow us