పంజాబ్ లో బీజేపీ నేత పొలాన్ని నాశనం చేసిన రైతులు.. నిరసనలో పాల్గొన్న మహిళలు… ( వీడియో )
పంజాబ్ లో ఓ బీజేపీ నేతకు చెందిన పొలాన్ని రైతులు నాశనం చేశారు. వివాదాస్పద రైతు చట్టాలు మూడింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వీరు ఇలా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పంజాబ్ లో ఓ బీజేపీ నేతకు చెందిన పొలాన్ని రైతులు నాశనం చేశారు. వివాదాస్పద రైతు చట్టాలు మూడింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వీరు ఇలా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బర్నాలా జిల్లాలో ధనౌలీ గ్రామంలోని హర్జిత్ సింగ్ గ్రెవాల్ అనే బీజేపీ నేతకు చెందిన పొలంలోకి ప్రవేశించిన వీరు అక్కడి వరి నాట్లను పెరికి వేశారు.. కొంతమంది మహిళలు కూడా ఈ ఆగ్రహ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 1. 5 ఎకరాల భూమిని అన్నదాతలు ట్రాక్టర్ తో దున్నేసి తమ కసి తీర్చుకున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వీరంతా ఒక్కసారిగా ఈ వెరైటీ ‘దాడికి’ దిగారు. రైతులపై హర్జిత్ సింగ్ గ్రెవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. అందువల్లే తామీ పని చేశామని ఈ సంఘం కన్వీనర్ బల్వంత్ సింగ్ ఉప్పాలి తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: సమద్రంలో ఉవ్వెత్తున చెలరేగిన మంటలు… ఆర్పేందుకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు… ( వీడియో )
Savings Scheme: గుడ్ న్యూస్.. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం..! ( వీడియో )
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
