స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్‌షాక్‌ !! చివరికి ఏమైందంటే ??

|

Jul 15, 2024 | 6:18 PM

కొన్ని కుటుంబాల్లోని పిల్లా, పెద్దా అంతా సరదాగా గడుపుదామని నగర శివారులోని ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్‌పూల్‌ చూడగానే ఆనందంతో స్విమ్‌చేద్దామని అందులోకి దిగారు కొందరు. అంతే కరెంట్‌ షాక్‌తో తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన హైదరాబాద్ శివారు జల్‌పల్లి శివారులో గురువారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది సరదాగా గడిపేందుకు జల్‌పల్లిలోని ఫాంహౌస్‌కు గురువారం ఉదయం వెళ్లారు.

సాయంత్రం సమయంలో ఫాంహౌస్‌లోని ఈతకొలనులోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో వీరంతా షాక్‌కు గురయ్యారు. కొలను మధ్యలోనే ఉన్న 19 ఏళ్ల పర్వేజ్ , 22 ఏళ్ల ఇంతియాజ్ రెండు నిమిషాల పాటు విద్యుదాఘాతానికి గురయ్యి తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈత కొలను లోపల లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. కొలనులోపలి విద్యుత్ దీపాల కనెక్షన్లు లోపలి నుంచి కాకుండా బయట నుంచి ఇచ్చారన్నారు. ఈ వైరు కొలనులో తెగిపోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతం ఆయినట్లు పేర్కొన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళా భక్తులకే ప్రవేశం !!భోలే బాబా ఆశ్రమ లీలలు

వంటింట్లో గ్యాస్‌ లీకవుతోందా.. జాగ్రత్త అది గ్యాస్‌ కాకపోవచ్చు

రైలుపట్టాలపై నీటిలో చేపలు సందడి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

లాకర్ తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు !!

పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్‌.. ఏం జరిగిందంటే..