Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీమచింతకాయా..అని తీసిపారేయకండి..లాభాలు తెలిస్తే షాకవుతారు

సీమచింతకాయా..అని తీసిపారేయకండి..లాభాలు తెలిస్తే షాకవుతారు

Phani CH

|

Updated on: Jun 07, 2025 | 1:15 PM

చింతకాయ.. గ్రామీణ ప్రజలకు ఇది సుపరిచితమే. పల్లెల్లో ఈ సీమ చింతచెట్లు ఎక్కువగా కనిపించేవి.. కానీ, ప్రస్తుతం పట్టణీకరణ కారణంగా పల్లెలు కూడా కాంక్రీట్‌ జంగీల్‌లుగా మారిపోతున్నాయి. దీంతో ఇలాంటి చెట్లు నేటి తరానికి పరిచయం కూడా లేకుండా పోతున్నాయి. అయితే ఈ సీమచింతకాయలు అద్భుతమైన ఔషధనిధి అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు.

గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే సీమ చింతకాయలు కాస్త తీయ్యగా, వగరుగా ఉంటాయి. కానీ, ఇందులోని పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, పాస్పరస్, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సీమ చింతకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచుతాయి. సీమ చింతకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది. గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. ఇవి మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సీమ చింతకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. సీమ చింతకాయలు గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సీమ చింతకాయ మరింత మేలు చేస్తుంది. క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి. సీమ చింతకాయలో ఉండే గుణాలు డయేరియా సమస్యను తగ్గిస్తాయి. తరచూ వీటిని తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. చర్మంపై నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. తరచూ సిమ చింతకాయలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లేం తల్లిదండ్రులు బాబోయ్.. స్కూల్లో పిల్లలముందే

పొట్ట నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. టెస్టులు చేసి వైద్యులే షాక్

రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన పోలీసుల కారు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

మట్టి తవ్వుతుండగా ఏదో శబ్దం.. ఇంకాస్త లోతుగా తవ్వగా.. ఆశ్చర్యకరంగా

మృత్యుంజయులు.. వంతెనపైనుంచి 50 అడుగుల లోతులో పడిన కారు