క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..

క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..

Phani CH

|

Updated on: Dec 26, 2024 | 1:23 PM

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ వివాదం రేపుతోంది. కిడ్నాప్ అయిన టీచర్ కి రాత్రంతా నరకం చూపించారు కిడ్నాపర్లు. అల్లు గుండు ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ రూమ్ లో ఉండగా టీచర్ మునీర్ అహ్మద్ ను కిడ్నాప్ చేశారు. దీంతో అర్ధరాత్రి వేళ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ముస్లిం సంఘాలు ధర్నాకు దిగడంతో ఇంటికి పంపిస్తామని హామీ ఇచ్చారు పోలీసులు.

తరువాత బాధితుడు ఇంటికి చేరుకున్నాడు. కోట్ల విలువైన భూమి విషయంలో రాజీకి రావాలంటూ కిడ్నాపర్లు ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. కిడ్నాపర్ల వెనుక పెద్దల హస్తం ఉందని బాధితుడు బంధువులు ఆరోపిస్తున్నారు. శనివారం నుంచి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యుల ఆందోళనకు గురయ్యారు. పోలీసులే కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక 20 కోట్ల రూపాయల విలువ చేసే భూమిపై వివాదం నెలకొన్ని నేపథ్యంలో కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భూవివాదంపై మునీర్ అహ్మద్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. వెల్దుర్తి పీఎస్‌లో బాధితుని భార్య కంప్లయింట్ ఇచ్చారు. భూమిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్‌.. బిర్యానీ తింటుండగా..

Pushpa 2: రప్ప.. రప్ప.. ఆగని పుష్ప 2 రికార్డుల దండయాత్ర

ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు

వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్‌.. ఇలా చేస్తే జైలు శిక్షే

Jeff Bezos: అమెజాన్ బాస్‌ పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చు