మహబూబాబాద్ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులో నుంచి రూ. 7 లక్షలు విలువ చేసే నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్-మంజుల దంపతులు బస్సు కోసం వేచి చూస్తుండగా ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు నేపధ్యంలో వెంటనే స్పందించిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కూతురు ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఇలా జరిగిందని బాధిత కుటుంబం బోరున విలపిస్తోంది.