Andhra: వాటర్ బాటిల్ కొందామని కారు ఆపాడు.. కట్ చేస్తే.. ఊహించని షాకిచ్చారుగా
బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేశాడు.. విజయవాడ నుంచి తిరువూరు వెళ్తున్నాడు. సరిగ్గా తిరువూరు బైపాస్ రోడ్డు చేరుకున్నాడు. కాస్త దాహం వేసిందని వాటర్ బాటిల్ కొందామని కారు ఆపాడు. ఆ తర్వాత.! ఏం జరిగింది.. ఈ స్టోరీలో ఓ సారి లుక్కేయండి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరువూరు బైపాస్ రోడ్డు సమీపంలో ‘AP 39DZ 5858’ కారు అద్దం పగలగొట్టి డాష్ బోర్డులో ఉంచిన లక్ష రూపాయల నగదును చోరీ చేశారు. మండలంలోని ఎర్రమాడుకు చెందిన మొగిలి సురేష్ బ్యాంక్ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసి.. ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో వాటర్ బాటిల్ కోసమని కారు దిగాడు. ఈలోగా కేటుగాళ్లు నిమిషాల వ్యవధిలో కారులోని నగదును మాయం చేశారు. నగదు పోయిందని గ్రహించిన బాధితుడు.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.
వైరల్ వీడియోలు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

