AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కన్స్ట్రక్షన్ బిల్డింగ్‌‌ నుంచి గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి వెళ్లి చూడగా

Viral: కన్స్ట్రక్షన్ బిల్డింగ్‌‌ నుంచి గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి వెళ్లి చూడగా

Ravi Kiran
|

Updated on: Sep 16, 2025 | 12:39 PM

Share

అది ఒక అటవీ ప్రాంతం.. దాని దగ్గరలోని మలాడ్ ఏరియాలో ఓ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది. అక్కడ నుంచి ఘాటైన వాసన గుప్పుమంది. అనుమానమొచ్చిన స్థానికులకు వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. కట్ చేస్తే.. సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత.!

ముంబై ఉపనగర ప్రాంతమైన మలాడ్‌లోని మల్వణి వద్ద మనిషి ఎముకలు బయటపడటంతో కలకలం రేగింది. ప్రాథమిక విచారణలో, ఆ ఎముకలు మానవ దేహానికి చెందినవేనని నిర్ధారణ అయింది. ‘మహాద్ అంజనీ’ బిల్డింగ్ కాంపౌండ్ దగ్గర ఈ ఎముకలు కనిపించాయి. సమాచారం అందుకున్న మల్వణి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం ఆ ఎముకలను పెట్టెలో వేసి డీఎన్‌ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. ఈ ఘటనను ధృవీకరించిన మల్వణి పోలీసులు, దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.