విజయవాడ బస్సు ప్రమాదానికి ప్రాథమిక కారణాలు ఇవే
విజయవాడ బస్సు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది ఆర్టీసీ. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అయితే రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ఆర్టీసీ ఎండీ ఘటనపై విచారణ జరిపిస్తున్నామన్నారు. 24 గంటల్లో రిపోర్ట్ వస్తుందనీ..ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ తెలిపారు.
విజయవాడ బస్సు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది ఆర్టీసీ. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అయితే రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ఆర్టీసీ ఎండీ ఘటనపై విచారణ జరిపిస్తున్నామన్నారు. 24 గంటల్లో రిపోర్ట్ వస్తుందనీ..ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మరోవైపు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు. బస్ కూడా కండిషన్‌లో లేదని, కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. డ్రైవర్ ప్రకాశం వయసు 62 ఏళ్లు కాగా, అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే కోలుకుని విధుల్లో చేరినట్టు ఆర్డీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు కండిషన్‌లోనే ఉందన్నారు. కాలం చెల్లిన బస్సులను తొలగిస్తున్నామని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెయ్యి రూపాయల కోసం హోర్డింగ్ ఎక్కి యువకుడి హల్‌చల్
Varun Tej-Lavanya Tripathi: ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్
ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించే యత్నం
Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్
మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్