Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. పెళ్లి చీర ఎలా కట్టుకుంటారంటే
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. ఈ ప్రత్యేక వేడుకలో వధువు రష్మిక కూర్గ్ శైలి ఎరుపు పట్టు చీర, కుప్పస, వస్త్ర, వెండి ఆభరణాలు ధరిస్తుంది. ఈ దుస్తులు కొడవ తెగ వీరత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. చీర కట్టు విధానం, ఆభరణాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ వివాహం తెలుగు, కొడవ సంప్రదాయాల మేళవింపుగా నిలుస్తుంది.
విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఇటు తెలుగు సంప్రదాయ పద్దతితో పాటు కొడవ వివాహ సంప్రదాయ పద్దతిలో కూడా జరగనుందని తెలుస్తోంది. కొడవ పద్దతిలో వధూవరుల దుస్తులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొడవ తెగ వీరత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. ఈ వివాహ వేడుకలో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కూడా ఇవే సాంప్రదాయ దుస్తులను ధరించనున్నారు. వధువు రష్మిక మందన్న దుస్తుల విషయానికి వస్తే.. కూర్గి శైలి చీర ధరించాలి. వధువు సాధారణంగా ఎరుపు రంగు పట్టు చీరను ధరిస్తుంది. ఈ చీర కట్టు చాలా విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా చీర కుచ్చుళ్లు ముందు ఉంటాయి.. కానీ వీరి సంప్రదాయంలో చీర కుచ్చెళ్లు వెనుక భాగంలో వస్తాయి అంతేకాదు చీర అంచు వెనుక నుంచి వచ్చి కుడి భుజంపై ఒక పిన్‌తో ఉంటుంది. కుప్పస – ఇది చీర లోపల ధరించే పొడవాటి చేతుల బ్లౌజ్. వస్త్ర – తల మీద ఎరుపు రంగులో ఉండే తలపాగా లేదా స్కార్ఫ్ లాంటిది. ఇక వధువు తన చేతులకు, కాళ్లకు వెండి గొలుసులను ధరిస్తారు. మెడలో చంద్రుని ఆకారంలో ఉండే పతకం.. దీన్ని వాళ్లు ‘కొక్కెతతి’ అంటారు. వీటిని అభరణాలుగా ధరించాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. వరుడు ఎలాంటి దుస్తులను ధరించాలంటే
Vijay-Rashmika Marriage: ‘విరోషి’ పెళ్లిలో.. ఘుమ ఘుమలాడే వంటకాలు
Anvesh: ‘నా అన్వేష్‌కు లుక్ అవుట్ నోటీసులు’ నోరు అదుపులో లేకపోతే ఇంతే
Vijay-Rashmika Marriage: పైసా వసూల్ పెళ్లి ?? భారీ ధరకు విరోషి పెళ్లి రైట్స్
‘ఆ ఇద్దరి గురించి నోరు జారాడు..’ పాపం !! అడ్డంగా దొరికిన తమన్
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ..
పాత స్మార్ట్ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. చివరికి ఇలా
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..

