Watch Video: హార్స్లీ హిల్స్‌లో అరుదైన జీవి.. అశ్చర్యానికి గురైన అటవీశాఖ..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్‌లో పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. బి కొత్తకోట మండలంలోని హార్స్లీ హిల్స్‌లో టూరిజం గెస్ట్ హౌస్ వద్ద కనిపించింది. ఇనుప కంచెకు చిక్కుకొని ఉన్న వన్యప్రాణిని గుర్తించిన పర్యాటకులు.. దానిని కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇనుప కంచెలో చిక్కుకున్నది పునుగుపల్లిగా నిర్ధారించుకున్న అటవీ శాఖ సిబ్బంది కాపాడారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్‌లో పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. బి కొత్తకోట మండలంలోని హార్స్లీ హిల్స్‌లో టూరిజం గెస్ట్ హౌస్ వద్ద కనిపించింది. ఇనుప కంచెకు చిక్కుకొని ఉన్న వన్యప్రాణిని గుర్తించిన పర్యాటకులు.. దానిని కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇనుప కంచెలో చిక్కుకున్నది పునుగుపల్లిగా నిర్ధారించుకున్న అటవీ శాఖ సిబ్బంది కాపాడారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కనిపించే అరుదైన పునుగుపిల్లి ఇప్పుడు హార్సిలీ హిల్స్ లో ఉనికిని చాటుకుంది. పునుగు పిల్లి నుంచి సుగంధ తైలం సేకరించి తిరుమల వెంకన్న అభిషేకానికి వినియోగిస్తారు. ఇలాంటి ప్రాధాన్యత ఈ అరుదైన వన్యప్రాణికి మాత్రమే ఉంది. అంతరించి పోతున్న జాతిగా భావిస్తున్న పునుగు పిల్లి తొలిసారిగా హార్సిలీ హిల్స్ లో కనిపించి అటవీశాఖ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు 18 రకాల జాతులున్న పునుగు పిల్లుల్లో హార్స్ లీ హిల్స్ లో గుర్తించిన పునుగు పిల్లి ఆసియా రకానికి చెందినదిగా తెలిపారు. హార్స్ లీ హిల్స్ వాతావరణం పునుగుపిల్లికి అనువైనదిగా భావిస్తున్న అటవీ శాఖ పులుగుపిల్లి మనుగడ ఈ ప్రాంతంలో ఉన్నట్టు భావిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

