Rare Banana: ఏపీలో అరుదైన అరటి పండ్లు.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?? ( వీడియో )
ఏపీలో ఓ రైతు పొలంలో పండిరు అరటి గెల చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. దీంతో ఆ అరటి గెలను చూసేందుకు చుట్టు పక్కల వారు వస్తున్నారు.
ఏపీలో ఓ రైతు పొలంలో పండిరు అరటి గెల చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. దీంతో ఆ అరటి గెలను చూసేందుకు చుట్టు పక్కల వారు వస్తున్నారు. మరోవైపు రుచి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. ఇంతకీ ఏంటి వాటి స్పెషల్. ఈ అరటి పండ్లను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఆదర్శ రైతు పండించిన అరటి పండ్లు ఇవి.. కేవలం సేంద్రీయ ఎరువుల వాడకంతో నాణ్యమైన పంట ఉత్పత్తి చేయొచ్చని ఈ ఆదర్శ రైతు రుజువు చేశాడు. తూర్పు గోదవారి జిల్లా ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన అరటి తోటలో తెల్ల చక్రకేళీ గెల మూడున్నర అడుగులు పైగా పెరిగింది. ఏకంగా 140 వరకు పండ్లు అరటి గెలకు ఉన్నాయి. వీటి బరువు 30 కిలోలపైనే ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: సింహాల గుంపుతో గేదె పోరాటం… అంతలోనే ఊహించని ట్విస్ట్.. ( వీడియో )
పోలీసులు చూస్తుండగానే షాప్ లోకి సైకిల్ పైన వచ్చి దర్జాగా దోచుకెళ్ళాడు…!! ( వీడియో )