Watch Video: వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన.. చంద్రబాబుకు చురకలు..

|

May 03, 2024 | 6:24 PM

పులివెందులలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రతిరోజూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే పనిలో ఉన్నారామె. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుంటున్నారు. పెన్షనర్ల అవస్థలు మళ్లీ జగన్ వస్తేనే తగ్గుతాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తనపాలనపై ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

పులివెందులలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రతిరోజూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే పనిలో ఉన్నారామె. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుంటున్నారు. పెన్షనర్ల అవస్థలు మళ్లీ జగన్ వస్తేనే తగ్గుతాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తనపాలనపై ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ క్రమంలోనే పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం వైఎస్ జగన్‎కు మద్దతుగా నిలిచారు వైఎస్ భారతి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తుంటే.. తన సొంత నియోజకవర్గం పులివెందులలో మాత్రం సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈమె ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే పెన్షనర్లపై స్పందించారు అమె. వృద్దులు పెన్షన్లు తీసుకోవడంలో నేటికీ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబుకు సంబంధించిన వాళ్లు ఈసీకి లేఖలు రాయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని.. చాలా దారుణమన్నారు. మే నుంచి బ్యాంకుల్లో పెన్షన్ డబ్బులు జమ చేసేలా ఆదేశాలు జారీచేసినప్పటికీ బ్యాంకుల వరకు వృద్దులు వెళ్లి తీసుకోవడంలో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అలాగే మేనిఫెస్టోపై కూడా స్పందించారు. సీఎం జగన్ ప్రస్తుతం ఇచ్చే రూ. 3000 పెన్షన్ కాస్త రూ. 3500 చేస్తామన్నారు. అదికూడా రెండు దఫాలుగా ఏడాదికి రూ. 250 పెంచుతూ వెళ్తామని చెప్పారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు రూ. 4000 ఇస్తామని చెబుతూ వైసీపీ మేనిఫెస్టోను నమ్మద్దని చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ వేశారు వైఎస్ భారతి. చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని ప్రజలందరూ అనుకుంటున్నట్లు చెప్పారు. ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వంలేదని చురకలు అంటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..