Watch Video: టీడీపీ సూపర్6 ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక

| Edited By: Srikar T

Apr 28, 2024 | 2:36 PM

చంద్రబాబు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో‎పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సాధ్యమయ్యేవి, ప్రజలకు ఏమి చేయగలమో వాటిని మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామన్నారు. సాధ్యం కానివి ఏవి కూడా చెప్పలేదన్నారు.

చంద్రబాబు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో‎పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సాధ్యమయ్యేవి, ప్రజలకు ఏమి చేయగలమో వాటిని మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామన్నారు. సాధ్యం కానివి ఏవి కూడా చెప్పలేదన్నారు. అబద్ధాలు లేకుండా, ఎవరిని మోసం చేయకుండా క్లియర్గా మేనిఫెస్టో ప్రవేశపెట్టామని తెలిపారు. రాజధాని విషయంపై సీఎం జగన్ మొదటి నుండి ఒకే మాట పై కట్టుబడి ఉన్నారన్నారు బుట్టా రేణుక. గతంలో టిడిపి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని, వైసీపీ మాత్రం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏదైనా చెప్పిందంటే అది చేస్తుందని, వీటిని ప్రజలు నమ్ముతున్నరని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి జగన్‎ను సీఎం చేయబోతున్నారని బుట్ట రేణుక ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..