Weekend Hour: ప్రధాని పర్యటన తర్వాత పీక్స్‌కి చేరిన బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్.. పొలిటికల్‌ స్ట్రీట్‌  ఫైట్‌

Weekend Hour: ప్రధాని పర్యటన తర్వాత పీక్స్‌కి చేరిన బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్.. పొలిటికల్‌ స్ట్రీట్‌ ఫైట్‌

Ram Naramaneni

|

Updated on: Apr 08, 2023 | 7:08 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ టూరు ప్రకటనతోనే బీఆర్ఎస్‌ - బీజేపీ మధ్య మాటలయుద్ధం మొదలైంది. ప్లెక్సీ వార్‌ నుంచి జంగ్‌ సైరన్‌ దాకా తెలంగాణ రాజకీయాలు కాక రేపాయి. తాజాగా పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రధానమంత్రి కూడా తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలతో వార్‌ పీక్స్‌లోకి చేరింది. లీక్స్‌ నుంచి సింగరేణి వరకూ నిన్నటిదాకా తలపడ్డ పార్టీలు ఇప్పుడు అవినీతి, అభివృద్ధి, పరివారం అంటూ పొలిటికల్‌ స్ట్రీట్‌ ఫైట్‌కు దిగాయి.

సందర్భం ఏదైనా.. తెలంగాణలో అడుగు పెట్టిన ప్రతిసారీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యం కేసీఆర్‌.. కేసీఆర్‌ కుటుంబం. వారసత్వ రాజకీయాలను విపరీతంగా ద్వేషించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి కేసీఆర్‌ కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకుని మరీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అవినీతి- కుటుంబపాలన వేర్వేరు కాదంటున్న మోదీ.. 2014 తర్వాత ఎన్నో మార్పులొచ్చాయన్నారు. నిజాయితీగా పోరాటం చేసేవాళ్లను చూసి అవినీతిపరులకు భయం పట్టుకుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్రం సహకరించడం లేదంటూ తప్పుబట్టారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

Published on: Apr 08, 2023 07:08 PM