Weekend Hour with Murali Krishna: మహారాష్ట్రలోని మొట్టమొదటి BRS కార్యాలయనాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ CM కేసీఆర్ – ఈ మధ్యే నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి సారించిన KCR తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రధాన పార్టీలకు మహారాష్ట్ర ఓటర్లు ఇప్పటి వరకు అనేక అవకాశాలిచ్చారని ఈసారి తమను ఆదరించాలని కేసీఆర్ కోరారు.
మహారాష్ట్రలో BRSకు ఒక అవకాశం ఇవ్వాలన్న KCR వ్యాఖ్యలను NCP అధినేత శరద్ పవార్ తప్పుబట్టారు. కాంగ్రెస్, NCPని టార్గెట్ చేస్తున్నట్టుగా KCR మాటలున్నాయని, చూస్తుంటే BJPకి B టీమ్‌గా BRS పనిచేస్తోందని విమర్శించారు.
బీజేపీ మాత్రం కాంగ్రెస్- BRS ఒక్కటేనని ఆరోపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసేది KCR అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్న పరిస్థితి.
కాంగ్రెస్ మాత్రం శరద్ పవార్ అన్న మాటలను సమర్ధిస్తోంది. BRS- BJP రెండు ఒక్కటేనని వాళ్ల మాటలు, చేతలే దానికి ఉదాహరణని అంటోంది.
మొత్తానికి ఈ B టీమ్ రాజకీయాలు తెలంగాణలో హోరు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఏ పార్టీకి ఎవరు B టీమ్? అసలు A టీమ్ అనేది ఏమైనా ఉందా అన్నది ప్రశ్నగా మారిపోతోంది.