Viksit Bharat Yatra: వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర లబ్దిదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.

Viksit Bharat Yatra: వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర లబ్దిదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.

Anil kumar poka

|

Updated on: Dec 30, 2023 | 5:04 PM

ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైనా సామాన్యుల లబ్ది కోసమే. కాని అది వారికి ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించిందో.. అసలు ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం. వాటి అమలు ఎలా ఉందో కూడా ప్రభుత్వం పర్యవేక్షించాలి. అందుకే దీనికోసం కేంద్రం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను కేంద్రం స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 27న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా త్రిపుర రాష్ట్రంలోని వికసిత్ భారత్ సంకల్ప్‌ యాత్ర లబ్ధిదారులతో మాట్లాడారు..

ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైనా సామాన్యుల లబ్ది కోసమే. కాని అది వారికి ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించిందో.. అసలు ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం. వాటి అమలు ఎలా ఉందో కూడా ప్రభుత్వం పర్యవేక్షించాలి. అందుకే దీనికోసం కేంద్రం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను కేంద్రం స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 27న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా త్రిపుర రాష్ట్రంలోని వికసిత్ భారత్ సంకల్ప్‌ యాత్ర లబ్ధిదారులతో మాట్లాడారు. నవంబర్ 15న ప్రారంభమైనప్పటి నుంచి ఈ యాత్ర విశేషంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి చేకూరడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన కారణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇక ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని నేరుగా ప్రధాని అడిగి తెలుసుకుంటున్నారు. గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రణాళికలు, చర్యలను ఈ యాత్ర వివరిస్తుంది.

2023 నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆదివాసీ గౌరవ్ దివస్ నాడు ప్రారంభమైన ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 26 గణతంత్ర దినోత్సవం వరకూ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా వేదిక అయింది. ఈ యాత్ర దేశంలోని 24 రాష్ట్రాల్లోని 68 జిల్లాలతో పాటూ కేంద్రపాలిత ప్రాంతాల్లో సాగుతుంది. దేశ వ్యాప్తంగా 8,500 పై చిలుకు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని గ్రామస్థాయిలో వివరించేందుకు ప్రత్యేకంగా ఐదు ఐసీఈ వ్యాన్లను ఏర్పాటు చేశారు. ఈ వ్యాన్‌లు జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయితీల్లో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమాల పథకాలపై ప్రచారం చేస్తాయి. ఇప్పటికే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ ప్రారంభమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.