Himachal Pradesh: ఆ రాష్ట్రంలో మందు బాబులకు వీఐపీ ట్రీట్‌మెంట్.! సంచలనంగా సీఎం ఆదేశాలు.!
సిమ్లాలో తొలిసారిగా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ శీతాకాలపు కార్నివాల్.. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్‌తో ప్రారంభమైంది. అయితే కార్నివాల్‌లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా మెలిగారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్‌లో కాకుండా హోటల్‌కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
సిమ్లాలో తొలిసారిగా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ శీతాకాలపు కార్నివాల్.. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్‌తో ప్రారంభమైంది. అయితే కార్నివాల్‌లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా మెలిగారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్‌లో కాకుండా హోటల్‌కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైనా టూరిస్ట్ మద్యం తాగి రచ్చ చేస్తే పోలీసులు వారికి వీఐపీ ట్రీట్‌మెంట్ అందించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి సుఖు మాట్లాడుతూ విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక రంగంలోని వ్యాపారం భారీగా నష్టపోయిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో జనం హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్‌ను 24 గంటలూ తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా పర్యాటకులను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు నానా హంగామా చేయకూడదని, చట్టాన్ని గుర్తుంచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అయితే మనాలిలో పర్యాటకులు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఘటనలు వెలుగు చూశాయి. కొందరు మద్యం సేవించి హల్‌చల్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!

