బీజేపీ-బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని తేలిపోయింది -విజయశాంతి

బీజేపీ-బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని తేలిపోయింది -విజయశాంతి

Ram Naramaneni

|

Updated on: Nov 18, 2023 | 2:40 PM

బీజేపీ, బీఆర్‌ఎస్ రహస్య పొత్తు పెట్టుకున్నాయని విజయశాంతి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. పాత స్నేహితులను కలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి బండి సంజయ్‌ను మార్చడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్‌ను మార్చడంలో కేసీఆర్ పాత్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

బీజేపీ-బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని ఆరోపించారు కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ చీఫ్‌ కోర్డినేటర్‌ విజయశాంతి. బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందం కారణంగానే బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి తప్పించారని ఆరోపించారు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ.. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోదీ వంటి నేతలు కేసీఆర్‌ను అవినీతిపరుడని పేర్కొన్నా, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు, ఉద్యమకారుల్ని బీజేపీ పిచ్చోళ్లను చేసిందన్నారు. బీజేపీది తెర ముందు ఒకమాట మాట్లాడుతూ.. తెరవెనుక బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు రాములమ్మ.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

 

Published on: Nov 18, 2023 02:38 PM