డిసెంబర్‌ 3 తర్వాత మహిళల కోసం 4 కొత్త పథకాలు: కేటీఆర్

కేసీఆర్ కామారెడ్డి నుండి గెలిచి హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని, వచ్చే ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుతు కష్టాలు తీర్చామన్నారు. కామారెడ్డిలో పోటీ చేస్తున్న రేవంత్‌ రెడ్డి నియోజకవర్గంలో విద్యుత్‌ తీగలు పట్టుకుంటే కరెంట్‌ ఉందో లేదో తెలుస్తుందని కౌంటర్‌ ఇచ్చారు.

డిసెంబర్‌ 3 తర్వాత మహిళల కోసం 4 కొత్త పథకాలు: కేటీఆర్

|

Updated on: Nov 18, 2023 | 2:54 PM

కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నారు మంత్రి కేటీఆర్. డిసెంబర్‌ 3 తర్వాత మహిళల కోసం 4 కొత్త పథకాలు తీసుకొస్తున్నామని చెప్పారు. 400కే సిలిండర్, ప్రతి పేద కుటుంబానికి 5లక్షల బీమా కల్పిస్తామన్నారు. కామారెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు తప్పవన్నారు. పట్వారీ వ్యవస్థ తీసుకువస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని.. అటువంటి వారికి అధికారం ఎందుకివ్వాలని ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us