పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో సమాన్యుల నుంచి సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు పోటీచేసేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో బందిపోటు, చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్ (కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్) కూతురు సైతం లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. కృష్ణగిరి నుంచి వీరప్పన్ కూతురు విద్య వీరప్పన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు NTK పార్టీ అధ్యక్షుడు సీమాన్. కృష్ణ గిరిలో భారీ మెజారిటీతో గెలిచి ప్రజలకు సేవ చేస్తానని వీరప్పన్ కూతురు విద్య వీరప్పన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
వీరప్పన్‌కున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి గత పార్లమెంటు ఎన్నికల్లో DMKకి మద్దతు పలికారు. ధర్మపురి పార్లమెంటు ఎన్నికల్లో ఆమె DMKకి తరపున ప్రచారం చేశారు.
అయితే నత్తమేడు అనే గ్రామంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో, ముత్తులక్ష్మి ప్రచారం ఆపేశారు. ఒకదశలో రాజకీయ పార్టీ నెలకొల్పడానికి ముత్తులక్ష్మి ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు.
ముత్తులక్ష్మి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా, ఆమె బిడ్డ విద్యా వీరప్పన్ మాత్రం రాజకీయంగా పావులు కదుపుతుండటం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..