Anna Hazare: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్నా హజారే రియాక్షన్.. వీడియో.
సామాజిక ఉద్యమకారుడు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అన్నా హజారే తన శిష్యుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు. సొంత చర్యల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఎక్కువ డబ్బు కోసమే మద్యం పాలసీని కేజ్రీవాల్ తీసుకువచ్చారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా తాను చేపట్టిన ఉద్యమం నుంచి ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ మద్యం పాలసీ చేసి ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
సామాజిక ఉద్యమకారుడు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అన్నా హజారే తన శిష్యుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు. సొంత చర్యల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఎక్కువ డబ్బు కోసమే మద్యం పాలసీని కేజ్రీవాల్ తీసుకువచ్చారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా తాను చేపట్టిన ఉద్యమం నుంచి ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ మద్యం పాలసీ చేసి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. తనతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి, మద్యం పాలసీని రూపొందించినందుకు తాను చాలా బాధపడ్డానని తెలిపారు. అయితే ఏమీ చేయలేమనీ .. ఏది జరిగినా చట్ట ప్రకారం జరగాలి అన్నారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అన్నా హజారే భారీ ఉద్యమాన్ని చేపట్టారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీగా ఆప్ అవతరించింది. అయితే అరవింద్ కేజ్రీవాల్‌కు ఆశీస్సులు ఇచ్చిన అన్నా హజారే ఆ పార్టీతో పాటు రాజకీయలకు దూరంగా ఉన్నారు. అలాగే ఆప్ తీరును పలుసార్లు విమర్శించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

