పార్లమెంట్ ఎన్నికల బరిలో వీరప్పన్ రెండవ కుమార్తె
గంధపు చెక్క, ఏనుగు దంతాల స్మగ్లర్ దివంగత వీరప్పన్ రెండవ కుమార్తె, న్యాయవాది విద్యారాణి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామ్ తమిళ్ కచ్చి పార్టీ అభ్యర్థిగా తమిళనాడులోని కృష్ణగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీకి రంగం సిద్ధమైంది. వీరప్పన్-ముత్తులక్ష్మి దంపతుల కుమార్తె విద్యా రాణి 2020లోనే తమిళనాట రాజకీయ రంగప్రవేశం చేశారు. బీజేపీలో చేరి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
గంధపు చెక్క, ఏనుగు దంతాల స్మగ్లర్ దివంగత వీరప్పన్ రెండవ కుమార్తె, న్యాయవాది విద్యారాణి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామ్ తమిళ్ కచ్చి పార్టీ అభ్యర్థిగా తమిళనాడులోని కృష్ణగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీకి రంగం సిద్ధమైంది. వీరప్పన్-ముత్తులక్ష్మి దంపతుల కుమార్తె విద్యా రాణి 2020లోనే తమిళనాట రాజకీయ రంగప్రవేశం చేశారు. బీజేపీలో చేరి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత ఆమె ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నటుడు, దర్శకుడు సీమాన్ నామ్ తమిళ్ పార్టీలో చేరారు. ప్రస్తుతం పుదుచ్చేరి సహా 40 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామ్ తమిళ్ పార్టీ పోటీ చేస్తోంది. మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ అంశాన్ని పరిగణలోకి తీసుకోని ఇరవై స్థానాలు పురుషులకి , ఇరవై స్థానాలు మహిళలకి కేటాయించారు సీమాన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తీవ్రవాద భావజాలంతో విద్యార్థి.. ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ అరెస్ట్
జూబ్లీహిల్స్ అపోలో ఆలయంలో ఘనంగా తృతీయ పుష్కరోత్సవం
Chiranjeevi: శ్రీకాంత్ నివాసానికి కేక్‌తో వెళ్లిన చిరంజీవి